Page Loader
Daaku Maharaaj : ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!
ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!

Daaku Maharaaj : ఓటీటీలోకి 'డాకు మహారాజ్'.. విడుదల తేదీ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లకు పైగా గ్రాస్‌, రూ.85 కోట్లకుపైగా షేర్‌ కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ రన్‌లో 'డాకు మహారాజ్' వంద కోట్ల షేర్‌ను సులభంగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విజయంతో బాలయ్య వరుసగా నాలుగు వంద కోట్ల షేర్‌ క్లబ్‌ మూవీలను అందుకున్న సీనియర్ హీరోగా సరికొత్త రికార్డు సృష్టించారు.

Details

ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్

థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటిటి వేదికపై ఎప్పుడు ప్రసారం అవుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ దక్కించుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'డాకు మహారాజ్' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 21 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 40 రోజుల రన్‌ తర్వాత డిజిటల్ వేదికపై అడుగుపెడుతోంది.