Daaku Maharaaj: అనంతపురంలోనే 'డాకు మహారాజ్' విజయోత్సవ వేడుక : నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అనంతపురంలోనే సక్సెస్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతుండటంతో త్వరలోనే విజయోత్సవ వేడుక ఉంటుందని చెప్పారు.
నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కూడా ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాలను పంచుకున్నారు.
Details
గతంలో ఈవెంట్ రద్దు
బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బృందం ముందుగా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో నిర్వహించాలని భావించింది.
అయితే తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది.
ఇదే అనంతపురంలో విజయోత్సవ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.