LOADING...
Dammunte Pattukora Song: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌'.. 'పుష్ప 2' సాంగ్‌ రిలీజ్‌

Dammunte Pattukora Song: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌'.. 'పుష్ప 2' సాంగ్‌ రిలీజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2024
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకోగా,మరోవైపు ఆయన ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈసినిమా రికార్డుల మీద రికార్డులు కొడుతూ చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1500కోట్లకు పైగా వసూళ్లు సాధించగా,అందులో ఒక్క హిందీ వెర్షన్ నుంచే రూ.704కోట్లు వసూలు కావడం విశేషం. మరోవైపు,మంగళవారం పుష్ప టీమ్ విడుదల చేసిన"దమ్ముంటే పట్టుకోరా"పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను అల్లు అర్జున్ స్వయంగా ఆలపించగా,సుకుమార్ అందించిన రెండు మూడు లైన్ల లిరిక్స్‌ ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయి. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌ దక్కించుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వివరాలు 

అల్లు అర్జున్‌ అరెస్టు

ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించగా, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. అయితే, డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. తాజాగా, ఈ కేసులో మరోసారి బన్నీని పోలీసులు విచారించడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.