Ravi Teja : రవితేజ 'మాస్ జాతర' గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా, గట్టి హిట్ మాత్రం లభించలేదు. గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన ఫలితం దక్కలేదు.
ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళీ పెద్ద హిట్ సాధించాలనే లక్ష్యంతో భాను బోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యా నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.
ఈ చిత్రంలో రవితేజ ఫుల్ ఎనర్జిటిక్ పోలీస్ గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రివీల్ చేశారు.
Details
బర్త్ డే కానుకగా 11:07 గంటలకు రిలీజ్
ఈ పోస్టర్‌తో పాటు, రవితేజ బర్త్ డే (జనవరి 26) సందర్భంగా ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సినిమా గ్లింప్స్‌ని విడుదల చేస్తామని ప్రకటించారు.
అభిమానులకు మరిన్ని అప్డేడ్స్ అందించేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ గ్లింప్స్‌లో రవితేజ ఓ విందు భోజనం చేస్తున్నట్లు ఉంది.
పసందైన విందులాగానే 'మాస్ జాతర' సినిమా ఉంటుందని పోస్ట్ ద్వారా మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. ఈ గ్లింప్స్ కోసం మాస్ రాజా అభిమానులు అతృతుగా ఎదురు చూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్
MARK YOUR CLOCKS!!🔥🥁🤙🏻#MASSJathara ~ MASS RAMPAGE GLIMPSE will be out TOMORROW at 11:07 AM! 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) January 25, 2025
Let’s Celebrate 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl’s SWAG and EXPLOSIVE energy in style!! 😎🔥@sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/WxtbngLARY