Page Loader
Double iSmart : రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ టీజర్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే ? 
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ టీజర్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే ?

Double iSmart : రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ టీజర్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడంటే ? 

వ్రాసిన వారు Stalin
May 12, 2024
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart)తో బిజీ అయ్యాడు. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా, ఈ మూవీని మార్చి 8, 2024న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరొక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా వెల్లడించారు.

Details 

'డబుల్ ఇస్మార్ట్' పోస్టర్‌ రిలీజ్‌ 

మే 15 రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక 'డబుల్ ఇస్మార్ట్' సినిమా కోసం మణిశర్మనే సంగీత దర్శకుడిగా పూరీ ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరీ జగన్నాథ్ వ్యవహరిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో, ప్యాన్ ఇండియా రేంజ్‌లో 'డబుల్ ఇస్మార్ట్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.