Nandi Awards: నంది అవార్డులకు ముహూర్తం ఫిక్స్.. బాలకృష్ణకు కీలక బాధ్యతలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2017 నుంచి 2024 వరకు నిలిచిపోయిన నంది అవార్డులతో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన సినిమా, టీవీ, నాటక రంగాల పురస్కారాలను కూడా అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక జ్యూరీలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక బాధ్యతను ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అప్పగించింది. ఆయన ఛైర్మన్‌గా రెండు వేర్వేరు జ్యూరీలను ఏర్పాటు చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబరులో విజయవాడ లేదా అమరావతిలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ
ఈ మేరకు ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ఎండీని కన్వీనర్‌గా నియమిస్తూ వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
వేడుకల నిర్వహణ, వేదిక ఖరారు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు, వసతి, రవాణా, భద్రత, బడ్జెట్ రూపకల్పన వంటి బాధ్యతలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ గురువారం 13 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
జాతీయ చలనచిత్ర పురస్కారాల ఎంపిక
2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల ఎంపిక కమిటీకి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సభ్యులుగా అల్లు అరవింద్, ఎస్. గోపాల్‌రెడ్డి, ప్రభలను నియమించారు.
అలాగే 2017 నుంచి 2024 వరకు ఎనిమిదేళ్లకు సంబంధించిన పురస్కారాల ఎంపిక కోసం మరో జ్యూరీని ఏర్పాటు చేశారు. దీనికీ బాలకృష్ణే ఛైర్మన్‌గా ఉండనున్నారు.
సభ్యులుగా వరప్రసాద్‌రెడ్డి, సుద్దాల అశోక్‌తేజ, కైకాల నాగేశ్వరరావులను నియమించారు.
వివరాలు
నంది టీవీ, ఫిల్మ్ అవార్డుల ఎంపికకు జ్యూరీ
2025 సంవత్సరానికి నంది టీవీ, ఫిల్మ్ అవార్డుల ఎంపిక కమిటీకి కొమ్మనాపల్లి గణపతిరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా రూపాదేవి, కోట శంకరరావు, సుబ్బరాయశర్మ, ఉదయభాను, జి. అనిల్‌కుమార్, బీవీ రమణారావు, ఏ. ప్రసాదరావు, డీవై చౌదరి, అనితా చౌదరి, సన, కేవీఎస్ దుర్గలను నియమించారు.
టీవీ మెగా సీరియల్స్‌లో ప్రథమ ఉత్తమ, ద్వితీయ ఉత్తమ పురస్కారాలతో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డుల ఎంపిక కోసం కూడా కమిటీలను ఏర్పాటు చేశారు.
2021 నుంచి 2024 వరకు అవార్డుల ఎంపికకు ఎట సత్యనారాయణ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సభ్యులుగా మేకా రామకృష్ణ, శిల్ప, అలహరి వెంకట వరప్రసాదరావు, ఎం. ఉదయ్‌కుమార్, చిలివేరు వెంకట అప్పారావు (ప్రభంజన్), కె. సత్యనారాయణ (ఈటీవీ), జి. హరిప్రసాద్‌లను నియమించారు.
వివరాలు
2025 నంది చలనచిత్ర పురస్కారాలకు ప్రత్యేక జ్యూరీలు
2017 నుంచి 2020 వరకు అవార్డుల ఎంపికకు సింగంపల్లి శృతి ఛైర్మన్‌గా ఉండనున్నారు.
సభ్యులుగా మేకల నర్సింగరావు, గుత్తికొండ భార్గవ్, పల్లెమాల సుధాకర్, సర్వేశ్వర్‌రెడ్డి, షేక్ అబ్దుల్ ఖుద్దూస్, సంపత్ మాడుగుల, చల్లా భాగ్యలక్ష్మిలను ఎంపిక చేశారు. 2025 సంవత్సరానికి సంబంధించిన నంది చలనచిత్ర పురస్కారాల ఎంపిక కోసం కూడా వివిధ విభాగాల్లో జ్యూరీలను నియమించారు.
ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై రూపొందించిన ఫీచర్ ఫిల్మ్స్, బాలల చిత్రాల ఎంపిక కమిటీకి దర్శకుడు బి. గోపాల్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సభ్యులుగా దర్శకులు వీఎన్ ఆదిత్య, సానాయాదిరెడ్డి, కె.అజయ్‌కుమార్, కెమెరామెన్ ఎంవీ రఘు, కథానాయకి కల్యాణి, నృత్యకారిణి బైర్రాజు శ్రీసంధ్యరాజు, నటుడు మాదాల రవి, జర్నలిస్ట్ వారణాసి లక్ష్మీనారాయణ, కెమెరామెన్ కండ్రు పూర్ణలను నియమించారు.
వివరాలు
ఛైర్మన్‌గా ప్రసన్న కుమార్
డాక్యుమెంటరీ, విద్యా విషయక చిత్రాల ఎంపిక కమిటీకి టి. ప్రసన్నకుమార్ ఛైర్మన్‌గా ఉండనున్నారు. సభ్యులుగా పీఎన్ రామచంద్రరావు, ఎం.ఎస్. ప్రసాద్, రాధా రాజేశ్వరి, డీఎస్ కన్నన్, కూనిరెడ్డి శ్రీనివాస్‌లను ఎంపిక చేశారు.
తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం, విమర్శకుల ఎంపిక కమిటీకి పరుచూరి గోపాలకృష్ణ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సభ్యులుగా రాంబాబు వర్మ, పామర్తి హేమసుందరరావులను నియమించారు.
నంది చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డుల ఎంపిక కోసం వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు.
2023, 2024సంవత్సరాలకు దర్శకుడు నరసింహారావు ఛైర్మన్‌గా ఉండనున్నారు.
సభ్యులుగా గాయని స్మిత వల్లూరుపల్లి, దర్శకుడు రాంప్రసాద్, కెమెరామెన్ రమణరాజు, ఎగ్జిబిటర్ అనుపమ్‌రెడ్డి, జర్నలిస్ట్ రవిచంద్రలను నియమించారు.
వివరాలు
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికకు జ్యూరీలు
2021, 2022సంవత్సరాలకు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, నిర్మాత ఎస్. కృష్ణప్రసాద్, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, ఆకాశవాణికి చెందిన ఐనంపూడి శ్రీలక్ష్మి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీఎస్‌ఆర్ వర్మలను ఎంపిక చేశారు.
2019, 2020సంవత్సరాలకు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ఛైర్మన్‌గా ఉండనున్నారు. సభ్యులుగా నిర్మాత డీవీకే రాజు, దర్శకులు చంద్ర సిద్ధార్థ, బీవీఎస్ రవి, తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన వనజ ఉదయ్, జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్ నారాయణలను నియమించారు.
2017, 2018సంవత్సరాలకు సీనియర్ జర్నలిస్ట్ ఎన్.సీతారామరాజు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సభ్యులుగా సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, దర్శకుడు వెంకీ, రచయిత రాజేంద్రకుమార్ పైడిపాటి, జర్నలిస్ట్ కంచనపల్లి రామనారాయణరాజు, డిస్ట్రిబ్యూటర్ అనంత హరిబాబులను ఎంపిక చేశారు.
వివరాలు
నంది అవార్డుల ప్రత్యేక సావనీర్ కమిటీ
నంది అవార్డులు 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్మారక సంచికను ప్రచురించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం రెంటాల జయదేవ ఛైర్మన్‌గా సావనీర్ కమిటీని ఏర్పాటు చేసింది.
సభ్యులుగా ఎల్. వేణుగోపాల్, ఎ. ప్రభు, ఎల్. ప్రసన్న ప్రదీప్, కె. వేణుగోపాలరావు, కె. వెంకటేశ్వరరావులను నియమించింది.
2025 సంవత్సరానికి సంబంధించిన నంది నాటక అవార్డుల ఎంపిక కోసం పద్యనాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటిక, కళాశాల, విశ్వవిద్యాలయ నాటికల విభాగాల్లో స్క్రూటినీ ప్యానళ్లను ఏర్పాటు చేశారు.
పద్యనాటక విభాగంలో ధర్మవరానికి చెందిన కీరప్ప, నరసరావుపేటకు చెందిన డా. అక్కిరాజు సుందర రామకృష్ణ, గుంటూరుకు చెందిన డా. చిట్టినేని లక్ష్మీనారాయణ సభ్యులుగా ఉన్నారు.
వివరాలు
నంది నాటక అవార్డుల ఎంపికకు స్క్రూటినీ ప్యానళ్లు
సాంఘిక నాటక విభాగంలో నెల్లూరుకు చెందిన జలదంకి సుధాకర్, నందిగామకు చెందిన ఆంథోని రాజ్, కావలికి చెందిన ఏవీ మల్లేశ్వరరావులను నియమించారు.
సాంఘిక నాటిక విభాగంలో చిత్తూరుకు చెందిన చింతం దేవనాథన్, ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, గుంటూరుకు చెందిన నుసుము నాగభూషణంలకు బాధ్యతలు అప్పగించారు.
బాలల నాటిక విభాగంలో ఒంగోలుకు చెందిన కేవీ రంగారావు, విజయనగరానికి చెందిన డా. పి. త్రినాథరావు, గుంటూరుకు చెందిన ముత్తవరపు సురేష్‌బాబులను సభ్యులుగా నియమించారు.
కళాశాల, విశ్వవిద్యాలయ నాటికల విభాగంలో నందిగామకు చెందిన డా. షేక్ బషీర్, విజయవాడకు చెందిన మాడుగుల రామకృష్ణ, కాకినాడకు చెందిన పి. దయానందబాబులకు చోటు కల్పించారు.
వివరాలు
తుది జ్యూరీల నియామకం
నంది నాటక అవార్డుల తుది ఎంపిక కోసం కూడా ప్రత్యేక జ్యూరీలను ఏర్పాటు చేశారు. పద్యనాటక విభాగంలో డా. అప్పాజోస్యుల సత్యనారాయణ, డా. నరాలశెట్టి రవికుమార్, షణ్ముఖ విజయకుమార్‌రాజులను నియమించారు.
సాంఘిక నాటక విభాగంలో డా. డీఎస్‌ఎన్ మూర్తి, వేణు, ప్రొఫెసర్ తూము శివప్రసాద్‌లకు బాధ్యతలు అప్పగించారు. సాంఘిక నాటిక విభాగంలో మల్లాది శివన్నారాయణ, ఎస్.కె. మిశ్రో, ప్రొఫెసర్ బి. నరేష్‌కుమార్‌లను ఎంపిక చేశారు.
బాలల నాటిక విభాగంలో డా. సమ్మెట వెంకటరమణ, డా. గుర్రాల రవికృష్ణ, డా. చిల్లర భవానీదేవిలను నియమించారు.
కళాశాల, విశ్వవిద్యాలయ నాటికల విభాగంలో రత్న శేఖర్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, డా. మంజులూరి కృష్ణకుమారి సభ్యులుగా ఉండనున్నారు. ప్రొఫెసర్ రాజీవ్ వెలశెట్టిని రిజర్వ్ సభ్యుడిగా నియమించారు.