Priyanka Chopra : డీప్'ఫేక్ బారిన మరో టాప్ హిరోయిన్.. ప్రియాంక చోప్రా నకిలీ వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా డీప్‌ఫేక్ బారిన పడ్డారు.గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను కొందరు ఆకతాయిలు వీడియో మార్ఫింగ్ చేశారు. ఆ వీడియోలో ప్రియాంక ముఖం మార్చకుండా, కేవలం వాయిస్‌ను మార్చిన ఆకతాయిలు ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్‌సింక్ చేసేశారు. తన వార్షిక ఆదాయ వివరాలను చెబుతున్నట్లు వీడియోను మార్ఫింగ్ చేశారు.ఓ బ్రాండ్ వల్ల 2023లో ఆదాయం భారీగా పెరిగిందని,అందరూ దాన్నే ఉపయోగించాలని ప్రియాంక కోరుతున్నట్లు సృష్టించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీల్లో దుమారం రేపుతోంది. ఓవైపు డీప్'ఫేక్ వీడియోలను అరికట్టేందుకు కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది.ఇటీవల రష్మిక తర్వాత అలియా భట్,కాజోల్, కత్రినా కైఫ్‌ల డీప్ ఫేక్ వీడియోలు ఆందోళన కలిగించాయి.