Page Loader
Rashmika: సైబర్ సేఫ్టీకి జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న 
సైబర్ సేఫ్టీకి జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న

Rashmika: సైబర్ సేఫ్టీకి జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి రష్మిక మందన్న ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (I4C) కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ వార్తను కేంద్ర హోంశాఖకి చెందిన సైబర్‌ దోస్త్ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రష్మిక ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు, అందులో గతంలో తాను ఎదుర్కొన్న డీప్‌ ఫేక్‌ అనుభవం గురించి మాట్లాడారు.

వివరాలు 

సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌

రష్మిక మాట్లాడుతూ,"కొన్ని నెలల క్రితం నా డీప్‌ ఫేక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజంగా ఒక సైబర్‌ క్రైమ్‌.ఆచేదు అనుభవం తర్వాత సైబర్‌ నేరాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను.దీనిపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని నేను అనుకున్నాను. ఇప్పుడు,సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నేను ఉన్నానని చెప్పడం నాకు గర్వంగా ఉంది.ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.సైబర్‌ నేరస్థులు ఎప్పుడైనా మనల్ని టార్గెట్‌ చేయడానికి సిద్ధంగా ఉంటారు.కాబట్టి మనం అలర్ట్‌గా ఉండాలిసైబర్‌ దోపిడీల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి.సైబర్‌ నేరాలపై అవగాహన పెంచడానికి నేను నా వంతు కృషి చేస్తాను.మన దేశాన్ని సైబర్‌ నేరాల నుంచి కాపాడేందుకు నేను ఈ కార్యక్రమంలో భాగమవుతాను." అని అన్నారు.

వివరాలు 

రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఇండస్ట్రీలో పెద్ద సంచలనం

గతంలో రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. జారా పటేల్ అనే వ్యక్తి వీడియోలో రష్మిక ముఖాన్ని వాడి, అసభ్యకరంగా ఉన్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగం గురించి రష్మిక తన ఆవేదనను వెల్లడించారు. ఆమె తరువాత మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల డీప్‌ ఫేక్ వీడియోలు కూడా బయటకొచ్చాయి. కేంద్రం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవడం తెలిసిందే.