
AA22xA6 movie: అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకోనే.. అట్లీ స్ట్రాటజీ అదిరింది!
ఈ వార్తాకథనం ఏంటి
బన్నీ అభిమానులకు సర్‌ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో చిత్ర బృందం అధికారికంగా దీన్ని ప్రకటించింది. ఇందులో దీపిక ఓ సూపర్ ఉమన్ వారియర్ తరహా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టమైంది.
అయితే అసలైన చర్చ దీపిక పాత్ర గురించి కాదండి.. ఆమె ఎంపిక జరిగిన నేపథ్యం గురించీ, మధ్యలో జరిగిన పరిణామాల గురించీ. ఎందుకంటే ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దగ్గరకు వచ్చిన దీపిక.. చివర్లో మాత్రం ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Details
స్పిరిట్ నుంచి తప్పుకున్న దీపికా
'యానిమల్' హిట్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్' కోసం దీపికను సంప్రదించారు.
స్క్రిప్ట్ ఆమెకు నచ్చడంతో ఆమె పీఆర్ టీమ్ ఇప్పటికే పలు వెబ్‌సైట్లకు లీక్ చేస్తూ.. దీపిక పాత్ర ఎంత ప్రత్యేకమైందో హైప్ క్రియేట్ చేసింది.
కానీ కొన్నిరోజుల్లోనే పరిస్థితి తారుమారు అయ్యింది. దీపిక తన పర్సనల్ టెర్మ్స్ వివరించగా దర్శకుడు ఒప్పుకోలేదట. రోజుకు కేవలం 8 గంటల షూటింగ్ మాత్రమే, రూ. 40 కోట్లు రెమ్యునరేషన్, లాభాల్లో షేర్ వంటి డిమాండ్లను ఆమె పెట్టిందట. అలాగే ఆమె పీఆర్ టీమ్ చేస్తున్న ప్రచారం కూడా సందీప్‌కు నచ్చలేదట.
దీంతో అతను ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించి.. తృప్తి దిమ్రిని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.
Details
మూడు విభిన్న పాత్రలో అల్లు అర్జున్
అంతటితో ఆగకుండా దీపికను ఉద్దేశిస్తూ తన ట్విట్టర్‌లో ఇండైరెక్ట్‌గా తిట్టేశాడు కూడా.
ఇలా 'స్పిరిట్' విషయంలో కాస్తా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న దీపిక.. ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టులో భాగమవుతోంది.
అయితే ఈ సినిమా మొదట మృణాల్ ఠాకూర్ పేరును పరిశీలించినట్లు సమాచారం. కానీ చివరకు దీపిక ఒత్తిడితోనే ఆమెను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు, దీపిక అడిగిన కండీషన్లను దర్శకుడు అట్లీ అంగీకరించినట్లు భావిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.
ప్రతి క్యారెక్టర్‌కు వేరే హీరోయిన్ ఉండనుంది. దీపికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రానికి కథానాయికలుగా ఖరారైనట్లు సమాచారం.