
Deepika Padukone: 'మన ఆస్కార్ చాలాసార్లు లాగేసుకున్నారు': భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు దక్కకపోవడంపై విచారం
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతమైన నటీనటులు ఉన్నారని ప్రముఖ నటి దీపికా పదుకొణె అన్నారు.
ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.అందులో ఆస్కార్ అవార్డుల గురించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అనేక సందర్భాల్లో మనం అందుకోవాల్సిన ఆస్కార్ అవార్డులను మన నుండి దూరం చేశారు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి.అయితే,ఆ సినిమాలు,ఆ కథలు,అలాగే నటీనటుల ప్రతిభకు అంతగా గుర్తింపు రాలేదు.'ఆర్‌ఆర్‌ఆర్'లోని పాటకు ఆస్కార్ ప్రకటించినప్పుడు నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను.ఆసమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాను.నిజంగా చెప్పాలి అంటే,ఆ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు.నేను ఆ చిత్రంలో భాగం కూడా కాదు.
వివరాలు
"డు యూ నో నాటు?
కానీ ఒక భారతీయురాలిగా,ఆ క్షణంలో నాకు గర్వంగా,ఆనందంగా అనిపించింది.ఆ అద్భుతమైన క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను.
ఇక ఈ ఏడాది 'ది బ్రూటలిస్ట్' చిత్రానికి గాను ప్రముఖ నటుడు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలుచుకోవడం నన్నెంతో ఆనందింపజేసింది" అని దీపికా తెలిపారు.
గతంలో, 2023లో జరిగిన ఆస్కార్ ప్రదానోత్సవంలో దీపిక పదుకొణె 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటను ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఆమె, "డు యూ నో నాటు? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం నుంచి 'నాటు నాటు' ఇదే.." అని చెప్పగా, ఆమె పరిచయం చేసిన వెంటనే ఆ వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది.