Deepika Padukone: గర్భవతిగా ఉండి కూడా యాక్షన్ సీన్స్.. 'రాకా' షూటింగ్‌లో దీపికా
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తిపట్ల చూపిస్తున్న అంకితభావం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉన్నప్పటికీ, తన కారణంగా ఏ సినిమా షూటింగ్ ఆగకూడదనే సంకల్పంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'రాకా' సినిమాలో దీపికా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెకు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా, ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ ఆ యాక్షన్ సీక్వెన్స్‌లను స్వయంగా పూర్తి చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
వివరాలు
డాక్టర్ల పర్యవేక్షణలో హీరోయిన్..
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో దీపికా ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ చిత్ర యూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. నిపుణులైన వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఇక 'రాకా'తో పాటు షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాలో కూడా దీపికా నటిస్తున్నారు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టుల షూటింగ్‌లను గర్భధారణ సమయంలోనే పూర్తి చేయాల్సి ఉండటంతో షెడ్యూల్స్‌కు అంతరాయం కలగకుండా ఆమె సహకరిస్తున్నారు. తాను తల్లి కాబోతున్న ఆనందాన్ని అనుభవిస్తూనే, వృత్తిపరమైన బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహించడం విశేషం. నిర్మాతలకు అదనపు ఆర్థిక భారాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమె కష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొంటుండటం పట్ల సినీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.