Deepika Padukone: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాము తల్లి దండ్రులు కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 2024లో ఆమె గర్భం దాల్చినట్లు వారు ప్రకటించారు.సెప్టెంబర్‌లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. దీంతో సెలబ్రిటీలు,నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీపిక,రణవీర్ చేసిన పోస్ట్ లో పిల్లల బట్టలు,పిల్లల బూట్లు,బెలూన్‌ల అందమైన మోటిఫ్‌లతో ఓ ఇమేజ్ ను పంచుకున్నారు. ఇటీవల వీళ్లిద్దరూ 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8'లో తమ పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ప్రసారమైన ఆ ఎపిసోడ్‌లోనే తొలిసారి వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చింది.