Akhil: మళ్లీ ఆలస్యం.. అఖిల్ 'లెనిన్' మూవీకి ఏమైంది?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఒక బిగ్ బ్లాక్‌బస్టర్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు. తొలి చిత్రం అఖిల్ నుంచి ఇటీవల వచ్చిన ఏజెంట్ వరకు ఆశించిన స్థాయి హిట్ అందుకోలేకపోవడంతో, ఈసారి మాత్రం ఖచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో అఖిల్ ముందుకు సాగుతున్నాడు. అదే పట్టుదలతో ఆయన ప్రారంభించిన కొత్త చిత్రం 'లెనిన్' ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో కూడిన పక్కా మాస్ కథగా నిర్మితమవుతోంది. ఇటీవల విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ టీజర్‌కు అఖిల్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచీ కూడా మంచి స్పందన లభించింది.
Details
హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే
ఈ టీజర్‌ను చూసిన చాలా మంది అఖిల్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ ఇదే అవుతుందని అభిప్రాయపడ్డారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఖరారుచేశారు. అయితే ఆమె ప్రస్తుత ఫామ్ సమస్యలు, బిజీ షెడ్యూల్ కారణంగా మేకర్స్ ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేశారు. ఈ మార్పు సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడేమో మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమా కథలో ముఖ్యమైన మార్పులు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే భారీగా చిత్రీకరించిన ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తిగా రీషూట్ చేయాలని దర్శకుడు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Details
'లెనిన్'పై భారీ అశలు పెట్టుకున్న అఖిల్
ఏజెంట్ చిత్రం డిజాస్టర్ అవడంతో, ఈసారి ఒక్క తప్పిదం కూడా చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో అఖిల్ ప్రతి సీన్‌ను స్వయంగా డబుల్ చెక్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే వరుస మార్పులు సినిమా ఫ్లోపై నెగటివ్ ప్రభావం చూపుతాయేమోనన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. అయినా ఇన్ని మార్పులు, హడావిడి జరుగుతున్నప్పటికీ... అఖిల్ మాత్రం 'లెనిన్' తన కెరీర్‌లో మలుపుతిప్పే మైల్‌స్టోన్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడట. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న 'లెనిన్' చివరకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది? ఈ చిత్రంతో అఖిల్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న బ్లాక్‌బస్టర్ విజయం సాధించగలడా? అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.