
Kesari Chapter 2: 'కేసరి చాప్టర్ 2' చూసి భావోద్వేగానికి గురైన దిల్లీ సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
జలియన్ వాలాబాగ్ విషాద సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'కేసరి చాప్టర్ 2' సినిమా దేశభక్తిని చిగురింపజేస్తోంది.
ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ చిత్రానికి దిల్లీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న దిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా సినిమా ప్రభావంతో భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేశారు.
అలాంటి వీరుల గాథలను తెలిసేలా ఈ సినిమా తీసారు. వారి వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఇప్పుడు మాతృభూమి కోసం ఏదైనా చేయాలన్న తపన కలుగుతోంది.
Details
ఈ సినిమాను అందురూ చూడాలి : రేఖా గుప్త
నా శరీరం, మనస్సు, జీవితాన్ని దేశానికి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు.
ఈ వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ కేసరి చాప్టర్ 2 నిజమైన దేశభక్తులకు నివాళిగా నిలుస్తుంది. దిల్లీ సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలని సోషల్ మీడియా వేదికగా చెప్పారు.
బ్రిటీష్ పాలకుల తప్పిదాలను ఈ సినిమా ద్వారా ప్రజల ముందు తీసుకువచ్చే ప్రయత్నమని, బ్రిటన్ ప్రభుత్వం సహా కింగ్ చార్లెస్ కూడా దీన్ని చూసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించగా, ఆర్. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రల్లో నటించారు.