
Vikram: విక్రమ్ మూవీ 'ధృవ నక్షత్రం' డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకున్నదంటే!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'ధృవ నచ్చతిరం: అధ్యాయం-1'.
ఈ తమిళ సినిమా తెలుగులో 'ధృవ నక్షత్రం' పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకనట రాలేదు.
రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 24, 2023న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో పార్థిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అధికారికంగా ప్రకటించని ఓటీటీ సంస్థ
This OTT platform bags the digital rights of the Vikram's upcoming movie?https://t.co/SATer9AasP#ChiyaanVikram #DhruvaNatchathiram #123telugu
— 123telugu (@123telugu) November 13, 2023