Page Loader
Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?
ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?

Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2024
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'దేవర'. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, తారక్‌కు జోడీగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా RRR విజయవంతమైన హిట్ తర్వాత తారక్ నటించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో ఎన్టీయార్, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, 'దేవర' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

వివరాలు 

 కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను క్రాస్ చేసిన దేవర 

నార్త్ అమెరికా సేల్స్ ప్రకారం, ప్రస్తుతానికి 335 లొకేషన్లలో 945షోలకు గాను $810,048 రాబట్టింది. టికెట్ల పరంగా చూస్తే 26,000 పైగా టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.యూఎస్‌లో అత్యంత వేగంగా 26 వేల టికెట్లు బుక్ అయిన సినిమాగా 'దేవర' మరో రికార్డును సృష్టించింది. యూఎస్ ప్రీమియర్స్‌కు ఇంకా 19రోజులు ఉండగానే ఈ రేంజ్ బుకింగ్స్ సాధించడం ఒక రికార్డ్ అని చెప్పాలి. ఓవర్సీస్ మొత్తంలో ఈ చిత్రం $882,230గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ప్రత్యేకంగా చెప్పాలంటే,ఈ చిత్రం రెబల్ స్టార్ నటించిన కల్కి సినిమాను అడ్వాన్స్ కలెక్షన్లలో అధిగమించింది. మరోవైపు,ప్రమోషన్లలో భాగంగా యంగ్ టైగర్ ముంబై చేరుకున్నారు.అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న ముంబైలో భారీ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు.

వివరాలు 

 భైరా పాత్రలో సైఫ్ అలీఖాన్ 

త్వరలో రాబోయే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు. భారీ యాక్షన్, మాస్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో భైరా అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జాన్వీ తన అందం, డ్యాన్స్, లుక్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

వివరాలు 

చేతికి కట్టు తీసేసిన తారక్ 

గత నెల ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైంది. దీనితో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఆ గాయం రెండు వారాల్లో తగ్గిపోతుందని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఇటీవల కర్ణాటకలోని ఆలయాలను సందర్శించిన సమయంలో కూడా ఎన్టీఆర్ చేతికి కట్టు ఉండటంతో అభిమానుల్లో గాయం ఇంకా తగ్గలేదా అనే అనుమానాలు కలిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఎడమ చేతికి ఉన్న కట్టును తొలగించారు. ఆయన ముంబైకి బయలుదేరుతున్న సమయంలో ఆ కట్టు కనిపించకపోవడంతో గాయం పూర్తిగా తగ్గిపోయిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ ఔట్‌ఫిట్ ధరించి, స్టైలిష్ లుక్‌తో ముంబై బయలుదేరిన ఎన్టీఆర్, బ్లాక్ హుడీ, జీన్స్, బ్లాక్ గ్లాసెస్‌తో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది.