Devara: ఫ్రీ-రిలీజ్ బిజినెస్‌లో 'దేవర' సంచలన రికార్డు.. రూ.215 కోట్లతో టాప్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' రిలీజ్‌కు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విదేశాల్లో బుకింగ్స్ ఊహించని రీతిలో జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 'దేవర' చిత్ర థియేట్రికల్ రైట్స్ విలువ రూ.215 కోట్లుగా నిర్ధారించారు. ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధికమని చెప్పొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.115 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచే అవకాశం కల్పించారు. ఓవర్సీస్‌లో ఇప్పటికే $2.5 మిలియన్ ప్రీ-సేల్స్‌తో సినిమా మంచి ఫామ్‌లో ఉంది. ఏరియా వారీగా రైట్స్ లెక్కలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. నైజాంలో రూ.42 కోట్లు, సీడెడ్‌లో రూ.23 కోట్లు, ఆంధ్రా ప్రాంతాల్లో రూ. 50 కోట్లు, మొత్తం రూ. 115 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రాబట్టింది. కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.9 కోట్లు, ఇతర భారతదేశంలో రూ.45 కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడై, మొత్తం 215 కోట్ల థియేట్రికల్ రైట్స్ వసూళ్లను నమోదు చేసింది.