Devara: పలు విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న దేవర.. ఇది కదా గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే..!
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన చిత్రం 'దేవర' (Devara). ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రూపొందించబడింది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, 'దేవర' భాగం 1, సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 'దేవర' మూవీ తాజాగా నవంబర్ 8 నుండి ఓటీటీలో ప్రసారం అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన నెట్ ఫ్లిక్స్‌లో తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఇంగ్లీష్, కొరియన్,స్పానిష్,బ్రెజిలియన్, పోర్చుగీస్ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు నిజంగా సర్‌ప్రైజ్‌గా చెప్పుకోవచ్చు.
హిందీ వెర్షన్ అందుబాటులో లేకపోవడంతో అభిమానులలో నిరాశ
మేకర్స్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం 'దేవర' సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, ఇప్పటి వరకు హిందీ వెర్షన్ అందుబాటులో లేకపోవడం అభిమానులలో నిరాశను కలిగిస్తోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌ను మేకర్స్ వీక్షించే వెసులు బాటు కల్పిస్తారా..? అనేది చూడాలి మరి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా, ప్రకాశ్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.