Devara: 'దేవర' వసూళ్ల ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. రూ.300 కోట్ల గ్రాస్
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన "దేవర" చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. మొదటి రోజే రూ.172 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండు రోజుల్లో రూ.243 కోట్లకు చేరుకుంది. వీకెండ్ ప్రభావంతో ఆదివారం రోజునే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరి, మొత్తం మూడు రోజుల్లో రూ.304 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. చాలా కాలం తర్వాత తారక్ సోలో హీరోగా కనిపించడం తో,అభిమానులు, సినిమా ప్రేమికులు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా,సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ చిత్రాన్నినందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్,హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు.