Page Loader
NTR: అట్లీతో సినిమాపై ఎన్టీఆర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అట్లీతో సినిమాపై ఎన్టీఆర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

NTR: అట్లీతో సినిమాపై ఎన్టీఆర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం 'దేవర' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నజూనియర్ ఎన్టీఆర్‌ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. 'దేవర' (Devara) విడుదలైన తరువాత, ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఓ కొత్త సినిమా ప్రారంభించనున్నారు. ఆ సినిమా తరువాత కోలీవుడ్‌ స్టార్‌ దర్శకులతో ఆయన సినిమాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వివరాలు 

ఎన్టీఆర్‌ అట్లీ కాంబినేషన్‌లో సినిమా

తాజాగా, కోలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ అట్లీతో చర్చలు జరిపినట్లు చెప్పారు. దీంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం ఖాయంగా కనిపిస్తుంది. "అట్లీ గొప్ప ప్రతిభావంతుడు. ఆయన నాకు ఒక ఆసక్తికరమైన రొమాంటిక్‌ కామెడీ కథ చెప్పారు. మేము దీని గురించి చర్చించాము. కానీ, నేను, అట్లీ వరుసగా ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న కారణంగా అది ముందుకు వెళ్ళలేదు. భవిష్యత్తులో అట్లీతో సినిమా చేస్తాను. ఆ ఆయన 'రాజారాణి' సినిమాను తెరకెక్కించిన విధానం నాకెంతో నచ్చింది"అని ఎన్టీఆర్‌ అన్నారు. అనంతరం, కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుల గురించి కూడా ఎన్టీఆర్‌ మాట్లాడారు. లోకేశ్‌ కనగరాజ్‌ పనితనం తనకు ఇష్టమని,ఆయన 'విక్రమ్‌' సినిమాతో తమిళ ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చారని పేర్కొన్నారు.

వివరాలు 

'రాయన్‌' సినిమాలో ధనుష్‌ నటన నచ్చింది:ఎన్టీఆర్ 

నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ 'జైలర్‌' సినిమాను రూపొందించిన విధానంపై ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్‌ను ఇప్పటివరకు అలాంటి పాత్రలో చూడలేదన్నారు. ఇటీవలి 'రాయన్‌' సినిమాలో ధనుష్‌ నటన తనకెంతో నచ్చిందని తెలిపారు. ఇక , 'దేవర' విషయానికి వస్తే, 'జనతా గ్యారేజ్‌' తరువాత ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంతో, జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తుంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపిస్తారు. విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.