Page Loader
Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..వారిని దేవుళ్లలా చూస్తారు..
తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు

Devara : తెలుగు ఆడియెన్స్ పై సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు..వారిని దేవుళ్లలా చూస్తారు..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ టాలీవుడ్‌లోనూ బిజీగా మారారు. ఇటీవల ఆయన వరుస సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ నిర్వహించిన కార్యక్రమంలో, ఆయన తెలుగు ప్రేక్షకులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఆడియన్స్‌ తమ అభిమాన హీరోలను దేవుళ్లలా పరిగణిస్తారని, అలాగే టాలీవుడ్‌లో టాప్‌ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం రావడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

ఆ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు

"తెలుగు సినిమా ప్రేక్షకులు చిత్రంలో పూర్తిగా మునిగిపోతారు. వారు తమ హీరోలను దేవుళ్లలా చూస్తారు. దర్శకులు, నిర్మాతలు ఆడియన్స్‌కు అవసరమైన విషయాలను గుర్తించి సినిమాలను రూపొందిస్తారు. ప్రతి కథపై స్పష్టమైన, బలమైన అవగాహన ఉంటుందని చెప్పారు. 'బాహుబలి' అద్భుతమైన పౌరాణిక,చరిత్రాత్మక చిత్రం,దాని చిత్రీకరణ కూడా అద్భుతం.మేము ఒకే దేశంలో ఉన్నప్పటికీ, మన అభిరుచులు పూర్తిగా వేరువేరు. భాషలు వేరుగా ఉంటాయి, కానీ కెమెరా ఆన్‌ చేయగానే అన్ని మారిపోతాయి. భాష కూడా అంతర్జాతీయంగా ప్రబలిస్తుందన్నారు. తాజాగా నటించిన 'దేవర'లో డైలాగ్స్‌ విషయంలో కొరటాల శివ చాలా సాయం చేశారు.ముంబయి నటుడిగా ఉన్నా,తెలుగులో చాలా సౌకర్యంగా పనిచేసాను. దక్షిణ భారత చిత్రాలు అనేక అద్భుతమైన విజయాలను సాధించాయి.హీరోలను చూపించే విధానం చాలా అద్భుతం"అని అన్నారు.

వివరాలు 

దేవర' సినిమాలో భైర‌ పాత్రలో సైఫ్‌ 

సైఫ్‌ అలీఖాన్‌ తాజా 'దేవర' సినిమాలో భైర‌ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఎదుర్కొని సంద్రాన్ని శాసించాలనుకునే పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌,సైఫ్‌ మధ్య యాక్షన్‌ సన్నివేశాలు బాగా ఉన్నాయనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.