ధమాకా బ్యూటీకి అదిరిపోయే అవకాశం: శ్రీలీల చేతుల మీదుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం నుండి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో మొత్తం ఆరు టీమ్ లు పాల్గొంటున్నాయి. అయితే ఈ సంవత్సరం జరగబోయే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 టోర్నమెంటును శ్రీలీల లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వైజాగ్ లోని వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ లో క్రీడాకారులు మాత్రమే కాదు రాజకీయ ప్రముఖులు, టీవీ సెలెబ్రిటీలు కూడా హాజరు కానున్నారు.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లో ఆరు జట్లు
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లో కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్ కార్యక్రమానికి శ్రీలీల వస్తుండడంతో అభిమానులంతా సంతోషంగా ఉన్నారు. ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం, రామ్ పోతినేని స్కంద, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఆదికేశవ సినిమాల్లో నటిస్తుంది. ఇంకా, నితిన్ హీరోగా రూపొందుతున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, బాలయ్య భగవంత్ కేసరి సినిమాల్లో కనిపిస్తుంది.