Loading...
Dhanashree Verma: హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ ఎంట్రీ.. దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో 'హే కన్నమ్మ'!
హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ ఎంట్రీ.. దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో 'హే కన్నమ్మ'!

Dhanashree Verma: హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ ఎంట్రీ.. దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో 'హే కన్నమ్మ'!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ మాజీ భార్య, డ్యాన్సర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ధనశ్రీ వర్మ హీరోయిన్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె కథానాయికగా నటిస్తున్న తొలి తెలుగు సినిమా 'హే కన్నమ్మ' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌తో పాటు అధికారిక టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వివరాలు

నవంబర్‌ 27న థియేటర్లలోకి 'హే కన్నమ్మ'

'హే కన్నమ్మ' ఒక మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా. ఇందులో ధనశ్రీ వర్మతో పాటు యశ్వంత్‌ మాస్టర్‌, కార్తీక మురళీధరన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం నవంబర్‌ 27న థియేటర్లలో విడుదల కానుంది. హీరోయిన్‌గా తన తొలి సినిమాతో ధనశ్రీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.

వివరాలు

హీరోయిన్‌గా కొత్త ప్రయాణం.. ధనశ్రీ పోస్ట్ వైరల్

తన కొత్త ప్రయాణం గురించి ధనశ్రీ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సినిమా పోస్టర్‌, టీజర్‌ను షేర్‌ చేస్తూ.. హీరోయిన్‌గా తన తొలి సినిమా టాలీవుడ్‌లో ప్రారంభం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఆ క్షణం రానే వచ్చింది. కథానాయికగా నా మొదటి చిత్రం.. తెలుగు చిత్రసీమలో నా తొలి అడుగు. ఇది దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌తో ప్రారంభమవుతోంది.

ఇంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది? ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఇందులో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం.

మీరందరూ ఈ చిత్రాన్ని వెండితెరపై చూడటం కోసం ఎదురుచూస్తున్నాను'' అని రాసుకొచ్చారు. ఈ సినిమా తనను హీరోయిన్‌గా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

2020లో వివాహం.. 2025లో విడాకులు

ధనశ్రీ వర్మ గతంలో టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ భార్యగా వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ 2020లో వివాహం చేసుకున్నారు.

అయితే 2025లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ధనశ్రీ హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ADVERTISEMENT