
Dhanush: ధనుష్-ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) కు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఈ విషయం గురించిన తీర్పు ఇటీవల కోర్టు నుండి వెలువడింది.
2022 జనవరిలో ధనుష్-ఐశ్వర్యలు తమ వివాహం విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.
18 సంవత్సరాల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ వారు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆ సమయంలో వారు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. విడాకుల కోసం వారు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
వివరాలు
పిల్లల పాఠశాల కార్యక్రమాలలో కలిసి..
కోర్టులో గత వారం జరిగిన విచారణలో,ఈ జంట తమ సహజీవనానికి ముగింపు చెప్పే నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు.
కోర్టు ఈ వాదనలను విన్న తరువాత,విచారణను 27వతేదీకి వాయిదా వేసింది.తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేస్తూ తుది తీర్పును వెలువరించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య 2004 నవంబర్ 18న ధనుష్‌తో వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు,యాత్ర, లింగ ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ జంట విడివిడిగా జీవించడమే కాక,విడాకుల ప్రకటన తరువాత కూడా వారు తమ పిల్లల పాఠశాల కార్యక్రమాలలో కలిసి పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలు ఐశ్వర్య వద్దే ఉంటున్నారు,అయితే కొన్ని సమయాల్లో తండ్రి ధనుష్ వద్దకు కూడా వెళ్ళిపోతున్నారని తమిళ మీడియా వెల్లడించింది.