Page Loader
Kubera : ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీని ప్రకటించిన టీమ్
ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీని ప్రకటించిన టీమ్

Kubera : ధనుష్, నాగార్జున 'కుబేర' ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీని ప్రకటించిన టీమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'కుబేర'. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రష్మిక మంధాన నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్స్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన కొత్త పోస్టర్‌లో నాగార్జునను మెలాంచోలిక్ లుక్‌లో కనిపించారు. ఖరీదైన సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న నాగార్జున, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న నగర లైట్స్, అతని చుట్టూ ఉన్న సంపద ఉన్నా, జీవితంలో ఏదో కోల్పోయిన కుబేరుడిగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

details

చివరి దశలో షూటింగ్

అంతకుముందు రిలీజ్ చేసిన ధనుష్, రష్మిక మంధాన పోస్టర్లకు కూడా మంచి స్పందన లభించాయి. శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా, గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. జిమ్ సర్భ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కుబేర సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లను ఫస్ట్ గ్లిమ్స్‌తో ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతున్నట్లు టాక్.