
D56 : పాపులర్ డైరెక్టర్‌తో మరోసారి ధనుష్.. D56 పోస్టర్ చూశారా?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమా జూన్‌లో థియేటర్లలోకి రానుంది. ఇక ఇదే ఏడాది ధనుష్ నటించిన 'ఇడ్లీ కడై', 'తేరే ఇష్క్ మే' సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ నేషనల్ అవార్డు విన్నర్ తాజాగా మరో సినిమాను ప్రకటించి తన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాడు.
ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు
ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా 'D56' పేరుతో ఈ సినిమాను ప్రకటించారు.
"మూలాలు ఒక గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయనే క్యాప్షన్‌తో విడుదల చేసిన థీమ్ పోస్టర్‌లో ఖడ్గం, పుర్రె వంటి హిస్టారికల్ ఎలిమెంట్స్ కనిపించడంతో.. ఇది ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా కానుందని స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టును వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.
సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు టీమ్ తెలిపింది. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'కర్ణన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
దీంతో 'ధనుష్-మారి సెల్వరాజ్' కాంబో మళ్లీ అదే స్థాయి మ్యాజిక్ చేస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ధనుష్
#D56 Roots begin a Great War
— Dhanush (@dhanushkraja) April 9, 2025
A @mari_selvaraj film pic.twitter.com/3yfhd6B2pZ