Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ.. నితిన్ హిట్ అందుకున్నారా?
'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంత వంశీ తెరకెక్కించిన రెండో చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man). ఇందులో నితిన్, శ్రీలీల(Nitin-Srileela) జంటగా నిలిచారు. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించాడు. టీజర్, ట్రైలర్లు వినోదభరితంగా ఉండటంతో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కాడో లేదో తెలుసుకుందాం. అభి(నితిన్) జూనియర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా బ్యాగ్రౌండ్ నుంచి కెమెరా ముందకు రావాలనేది జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత(శ్రీ లీల) ప్రవేశిస్తుంది. ఆమె అభిని ప్రేమించడంతో కంపెనీకి సీఈఓని చేస్తుంది
జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో ఒదిగిపోయిన నితిన్
ఆ సమయంలో హీరోగా అతనికి అవకాశం వస్తుంది. దీని కోసం దొంగ పోలీస్‌గా కోటియా గ్రామానికి వెళుతాడు. హీరోకి రియల్ విలన్ నీరో (సుదేవ్ నాయర్) తమ్ముడితో గొడవ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) ఏం చేశారన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాతో దర్శకుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. శ్రీలీల పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ప్రతినాయకుడు నీరో పాత్రలో సుదేవ్ నాయర్ భీకరమైన లుక్స్‌తో కనిపించారు. కథ, స్క్రీన్ ప్లే రోటిన్ ఉండడం ప్రేక్షకులను బోర్ కొట్టిస్తుంది. చివరిగా ఈ సినిమా ఆర్డినరీ కామెడీ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు.