నాగ చైతన్య టాటూని సమంత చెరిపేసారా? ఫోటోలు చెబుతున్న నిజాలేంటి?
నాగ చైతన్య, సమంత విడిపోయినప్పటి నుండి ఏదో ఒక విషయమై వాళ్ళిద్దరి గురించి ఇంటర్నెట్ లో అనేక వార్తలు వస్తుంటాయి. తాజాగా చైతన్య టాటూని సమంత చెరిపేసుకుందని అంటున్నారు. అందుకు సాక్ష్యంగా సమంత ఇటీవల ఫోటోలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు. ఇటీవల దోహాలో జరిగిన వేడుకలో పింక్ కలర్ డ్రెస్ లో సమంత కనిపించారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో సమంత ఒంటి మీద చైతన్య టాటూ కనిపించలేదు. దాంతో, చైతన్య టాటూని సమంత చెరిపేసిందా? లేదా ఫోటో షాప్ ద్వారా చెరిపేసిందా అని ప్రశ్నలు వేస్తున్నారు.
సమంత ఒంటిపై మూడు టాటూలు
సమంత ఒంటి మీద మొత్తం మూడు టాటూ ఉన్నాయి. తన మొదటి సినిమా, ఏ మాయ చేసావె సినిమాకు గుర్తుగా YMC అనే పచ్చబొట్టు ఉంది. అలాగే మణికట్టు మీద నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకో అన్న అర్థం వచ్చేలా మరొక టాటూ ఉంది. ఇంకా సమంత పక్కటెముకల మీద చైతన్య నిక్ నేమ్ చై అనే పచ్చబొట్టు ఉంది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పింక్ కలర్ డ్రెస్ లో, చై పచ్చబోట్టు కనిపించలేదు. దాంతో, చై పచ్చబొట్టును సమంత చెరిపేసిందా? లేదా ఫోటో షాప్ ద్వారా తొలగించిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో చై అన్న పచ్చబొట్టు కనిపించేలా సమంత దిగిన చాలా ఫోటోలను ప్రస్తుతం షేర్ చేస్తున్నారు.