TOLLYWOOD ANIMAL : 'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తాజా చిత్రం 'యానిమల్' తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ఆడి పాడిన యానిమల్ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఈ సినమాకు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తెలుగు హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు యానిమల్ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల మీద ఉన్న ఆసక్తి కారణంగా మంచి కథ బలం ఉన్న చిత్రాన్ని దిల్ రాజు ప్రమోట్ చేసేందుకు ముందు వరుసలో ఉంటారు.
స్టార్ ప్రొడ్యూసర్ హోదాతో పంపిణీదారుడిగా కొనసాగుతున్న దిల్ రాజు
టాలీవుడ్ పరిశ్రమలో దిల్ రాజు అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. మరోవైపు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో సినిమా విడుదలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంలో ఆయన నేర్పరి. స్టార్ ప్రొడ్యూసర్ హోదాలో ఉన్నా, తన ఎదుగుదలకు కారణమైన సినిమా పంపిణీని ఇంకా కొనసాగించడం గమనార్హం. సొంత బ్యానర్ లో భారీ సినిమాలని నిర్మిస్తూ, హిట్ సినిమాలుగా మలుస్తూ డిస్ట్రిబ్యూషన్లోనూ విజయవంతంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.