దిల్ రాజు చేతిలో ఎవ్వరూ ఊహించని భారీ ప్రాజెక్ట్
ఈ వార్తాకథనం ఏంటి
శాకుంతలం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిర్మాత దిల్ రాజు, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆల్రెడీ బలగంతో బంపర్ హిట్ దక్కించుకుని ఖుషీగా ఉన్నారు దిల్ రాజు.
ఈ మధ్య కాలంలో దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన అతిచిన్న సినిమా బలగం ఒక్కటే. స్టార్ హీరోలు, పెద్ద బడ్జెట్లతో సినిమాలు తీస్తున్న దిల్ రాజు, సడెన్ గా తన నిర్మాణ సంస్థకు చిల్డ్రన్ సంస్థను స్థాపించి వారసులకు అప్పగించారు.
ఇకపై చిన్న సినిమాలన్నీ చిల్డ్రన్ కంపెనీ అయిన దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే దిల్ రాజు చేతిలో ప్రస్తుతం అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయి.
Dil Raju
రజనీ కాంత్ తో దిల్ రాజు సినిమా
రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ తో పాటు మరో తమిళ స్టార్ హీరోతో సినిమా తీయబోయేందుకు దిల్ రాజు రెడీ అవుతున్నారట.
మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు.ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా జైలర్ చిత్రం తెరకెక్కింది. జైలర్ తర్వాత జై భీమ్ దర్శకుడి దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.
ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది.
వారిసు సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన దిల్ రాజు, అక్కడ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా చేయడానికి సిద్ధమైపోయారు. మరి ఈ సినిమాపై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.