Page Loader
దిల్‌ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ.. కేటీఆర్ సూచన మేరకు ఎత్తుకెళ్లాట..
మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఎత్తుకెళ్లినట్లు చెప్పింది ఎవరో తెలుసా

దిల్‌ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ.. కేటీఆర్ సూచన మేరకు ఎత్తుకెళ్లాట..

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 14, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. అర్చిత్ రెడ్డికి చెందిన ఖరీదైన పోర్షే కారు జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురైంది. శుక్రవారం ఉదయం అర్చిత్ రెడ్డి దంపతులు, దసపల్లా హోటల్‌కు పోర్షే కారులో వెళ్లారు. ఈ క్రమంలోనే కారును హోటల్‌ వద్ద నిలిపి ఉంచారు. అనంతరం లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి రూ.1.7 కోట్ల ఖరీదైన లగ్జరీ కారు మాయమైంది. ఈ మేరకు బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్‌ జంప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను వెంటనే అలెర్ట్ చేసి నిందితుడిని పట్టుకున్నారు.

DETAILS

సాయి కిరణ్ మాటలకు అవాక్కైన పోలీసులు

నిందితుడు మల్లెల సాయికిరణ్‌, మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. తాను రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ వ్యక్తిగత సహాయకుడు (PA)నని చెప్పాినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే మంత్రి కేటీఆరే ఆ కారును తీసుకెళ్లాలని సూచించినట్లు తెలపడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. తన సహాయకుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలిసేందుకు వెళ్తున్నట్లు కారు ఎత్తుకెళ్లినట్లు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే పోలీసులు సాయి కుటుంబ సభ్యులను ఫోన్లో సంప్రదించారు. అయితే సాయికిరణ్ బ్రైట్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థలో మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో కారును అర్చిత్ రెడ్డికి అప్పగించి పోలీసులు అతడ్ని విడిచిపెట్టారు.