Page Loader
VIJAY DEVARAKONDA : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. త్వరలోనే 13వ సినిమాకు టైటిల్ ప్రకటన
త్వరలోనే 13వ సినిమాకు టైటిల్ ప్రకటన

VIJAY DEVARAKONDA : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ.. త్వరలోనే 13వ సినిమాకు టైటిల్ ప్రకటన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 27, 2023
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ 13వ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం అందింది. ఈ మేరకు సంక్రాంతి బరిలో నిలవనున్నారు. 2024 సంక్రాంతికి 13వ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. లైగర్ అట్టర్ ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. సమంత జోడిగా ఖుషితో మోస్తరు విజయం సాధించారు. 12వ సినిమా విశేషాలతో గడిపేస్తున్న విజయ్, ఉన్నఫలంగా 13వ చిత్రం విడుదలను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని సంస్థ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న VD 13