LOADING...
9 ఏళ్ల తర్వాత నీలకంఠ సినిమా 'సర్కిల్'.. టీజర్ రిలీజ్ !
సర్కిల్ మూవీ టీజర్ రిలీజ్

9 ఏళ్ల తర్వాత నీలకంఠ సినిమా 'సర్కిల్'.. టీజర్ రిలీజ్ !

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 05, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ నీలకంఠ సర్కిల్ రూపంలో రీఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో అంచనాలను పెంచుతోంది. ఆది నుంచి నీలకంఠ, ఎందుకో మరి విభిన్నమైన కథలను ఎంచుకుంటుంటాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో 'మిస్సమ్మ' వంటి విలక్షణమైన చిత్రాలున్నాయి. సినిమా కోసం ఆయన సెలక్ట్ చేసుకునే కథలు, అందులోని పాత్రలను ఆయన డిజైన్ చేసే విధానంలో కొత్తదనం ఉంటుందనే పేరు ఉంది. అలాంటి నీలకంఠ నుంచి తాజాగా సర్కిల్ చిత్రానికి సంబంధించి సోమవారం మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

Director Neelakanta Re Entry Into Tollywood For Circle 

యువత నేపథ్యంలో సాగే సర్కిల్ 

ఈ పోస్ట‌ర్‌లో కెమెరా వెనుక ఓ యువ‌కుడు క‌నిపిస్తోన్నాడు. కెమెరా లెన్స్‌పై స‌ర్కిల్ ఆఫ్ డెత్‌, స‌ర్కిల్ ఆఫ్ ల‌వ్‌, స‌ర్కిల్ ఆఫ్ ఫేట్ అనే అక్ష‌రాలు ఉండ‌టం ఉత్కంఠతను పెంచుతోంది. శరత్ చంద్ర, సుమలత, వేణు బాబు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో' అనే క్యాప్షన్ కూడా పెట్టారు. లవ్, యాక్షన్, రొమాన్స్ సన్నివేశాలతో ఈ సినిమా రూపుదిద్ధుకుందనే సంగతి టీజర్ ను చూస్తేనే తెలిసిపోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రసు సంగీతం అందించగా, హీరో, హీరోయన్లుగా సాయిరోన‌క్‌, రిచా పనై, అర్షిన్ మెహతా నటిస్తున్నారు. త్వరలోనే సర్కిల్ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సర్కిల్ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ట్వీట్