Page Loader
VN Aditya: లాంగ్ గ్యాప్‌ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్య రీ ఎంట్రీ .. కేథరీన్‌తో కొత్త సినిమా
లాంగ్ గ్యాప్‌ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్య రీ ఎంట్రీ .. కేథరీన్‌తో కొత్త సినిమా

VN Aditya: లాంగ్ గ్యాప్‌ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్య రీ ఎంట్రీ .. కేథరీన్‌తో కొత్త సినిమా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన టాలెంటెడ్‌ డైరెక్టర్ వీఎన్‌ ఆదిత్య మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, లాంగ్ గ్యాప్‌ తరువాత కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ కొత్త సినిమాను ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ ‌ బ్యానర్‌లో, ఏయు & ఐ సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో నటిస్తున్నారు. కేథరీన్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఇవాళ స్పెషల్‌ పోస్టర్‌‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్‌ ఆకట్టుకుంది.

Details

డల్లాస్‌లో సినిమా షూటింగ్

సినిమా స్ట్రాంగ్ కంటెంట్‌తో, ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఉంటుందని వీఎన్ ఆదిత్య తెలిపారు. దేశ విదేశాలకు చెందిన కొత్త నటీనటులను పరిచయం చేయనున్నారు. అమెరికన్, స్పానిష్, ఆఫ్రికన్, యూరోపియన్, తమిళ్, కన్నడ, తెలుగు భాషల నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ యూఎస్‌లోని డల్లాస్‌లో జరగనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే శరవేగంగా సాగుతుండగా, త్వరలో ఈ థ్రిల్లర్‌ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాతో వీఎన్ ఆదిత్య తన కెరీర్‌లో మరో సూపర్‌ హిట్ అందిస్తాడని, తిరిగి ఫామ్‌లోకి వస్తాడని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.