Page Loader
Oscars 2025: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ రేసులో 'లాపతా లేడీస్‌'కు నిరాశ
ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ రేసులో 'లాపతా లేడీస్‌'కు నిరాశ

Oscars 2025: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ రేసులో 'లాపతా లేడీస్‌'కు నిరాశ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2024
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

లాపతా లేడీస్‌ ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌ చేరుకోలేక సినీప్రియులను నిరాశపరచింది. 2025 ఆస్కార్‌ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన 'లాపతా లేడీస్‌' చిత్రం తుది షార్ట్‌లిస్ట్‌ జాబితాలో స్థానం పొందడంలో విఫలమైంది. డిసెంబర్ 17న అకాడమీ ప్రకటించిన జాబితాలో ఈ సినిమా లేకపోవడం తెలుగు ప్రేక్షకులతో పాటు సినీ ప్రపంచాన్ని నిరాశకు గురి చేసింది. కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్‌ రేసులో ఉన్నప్పటి నుంచి అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హాలీవుడ్‌ మీడియాలో కిరణ్‌రావు, ఆమిర్‌ఖాన్‌ పలు ఇంటర్వ్యూలు ఇచ్చి, సినిమాకు ప్రాధాన్యం చాటి చెప్పారు.

Details

ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో 'సంతోష్'

మహిళల స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం, భవిష్యత్తుపై నిర్ణయాలను తీసుకునే సామర్థ్యం వంటి సామాజిక సమస్యలను చర్చించే గొప్ప కథగా ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ తుది జాబితాలో చేరడంలో చిత్రం వెనుకబడి పోయింది. ఇక ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో మరో భారతీయ నటి శహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన 'సంతోష్‌' హిందీ చిత్రం స్థానం సంపాదించింది. యూకే నుంచి ఆస్కార్‌ అవార్డుల కోసం ప్రతినిధిగా పంపిన ఈ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో తుది షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

Details

ఆస్కార్‌కు చేరుతుందనుకుని ఊహించలేదు : శహానా గోస్వామి

సంధ్యా సూరి దర్శకత్వం వహించిన 'సంతోష్‌' 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ సినిమా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ విజయం గురించి శహానా గోస్వామి మాట్లాడుతూ చిత్ర బృందం నుంచి షార్ట్‌లిస్ట్‌ విషయాన్ని తెలిసినప్పుడు తాను అవాక్కయ్యాయని, ఆస్కార్‌కు చేరుతుందనుకుని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఇది తమకెంతో గర్వకారణమని చెప్పారు. ఈసారి 'లాపతా లేడీస్‌'కు నిరాశ ఎదురైనా, 'సంతోష్‌' చిత్రానికి స్థానం లభించడం కొంత ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు.