Page Loader
Hansika : హీరోయిన్ హన్సికతో విడాకులు.. స్పందించిన భర్త!
హీరోయిన్ హన్సికతో విడాకులు.. స్పందించిన భర్త!

Hansika : హీరోయిన్ హన్సికతో విడాకులు.. స్పందించిన భర్త!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించిన స్టార్ హీరోయిన్‌ హన్సిక విడాకుల వార్తలతో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే హన్సిక, ఆమె భర్త సోహైల్‌ విడివిడిగా నివసిస్తున్నారని, వారి వివాహ బంధం ముగిసింందని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో సోహైల్‌ చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. అయితే ఆ సంబంధం ఎక్కువకాలం నిలబడకపోవడంతో విడిపోయారు. అనంతరం హన్సిక - సోహైల్ మళ్లీ దగ్గరయ్యారు. కొంతకాలం ప్రేమలో ఉన్న ఇద్దరూ 2022 డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.

Details

తప్పుడు కథనాలు నమ్మొద్దు

గతేడాది డిసెంబర్‌లో రెండో యానివర్సరీ సందర్భంగా హన్సిక ఓ పోస్ట్‌ కూడా చేసింది. అయితే ప్రస్తుతం ఈ జంట బంధం బలహీనపడిందన్న ప్రచారం ఊపందుకుంది. ఈక్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ సోహైల్‌ ఈ విడాకుల గాసిప్స్‌పై స్పందించాడు. 'విడాకుల విషయంలో చక్కర్లు కొడుతున్న పుకార్లు పూర్తిగా తప్పుడువేనని స్పష్టంగా పేర్కొన్నాడు. అయితే హన్సిక తన తల్లితో కలిసి ఉంటుండగా, సోహైల్‌ తన తల్లిదండ్రులతో వేరుగా నివసిస్తున్నారని వినిపిస్తున్న విషయంపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇక ఈ వ్యవహారంపై ఇప్పటివరకు హన్సిక ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.ఆమె మాట కూడా వెలువడాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హన్సిక స్పందనపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.