Kamal Haasan: కమల్ హాసన్‌కు డీఎంకే గిఫ్ట్.. త్వరలో రాజ్యసభలోకి ప్రవేశం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌కు రాజకీయంగా మరో పదవి దక్కనుంది.
త్వరలోనే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు డీఎంకే పార్టీ కమల్ హాసన్‌కు సందేశం పంపింది.
బుధవారం డీఎంకే మంత్రి శేఖర్ బాబు ఆయనను కలిసి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో మక్కల్ నీది మయ్యమ్ పొత్తు పెట్టుకుంది. కమల్ హాసన్ కూడా డీఎంకే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Details
పెద్దల సభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్
కోయంబత్తూర్ నుంచి బీజేపీ నేత అన్నామలైపై పోటీ చేసేందుకు సిద్ధమైన కమల్, స్టాలిన్ సూచనల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు.
జూలై 2025లో రాజ్యసభకు నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఒక రాజ్యసభ సీటును కమల్ హాసన్‌కు కేటాయించాలని డీఎంకే అధినేత స్టాలిన్ నిర్ణయించారు.
ఈ విషయాన్ని మంత్రి శేఖర్ బాబు, కమల్ హాసన్‌కు తెలియజేశారు. మొత్తానికి 2025 జూలైలో కమల్ హాసన్ అధికారికంగా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.