Page Loader
800 ట్రైల‌ర్ లాంఛ్‌కు ముహూర్తం ఖరారు.. ముఖ్యఅతిథి ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ముఖ్యఅతిథి ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్యపోతారు

800 ట్రైల‌ర్ లాంఛ్‌కు ముహూర్తం ఖరారు.. ముఖ్యఅతిథి ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్, లెజెండరీ క్రికెట్‌ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మేరకు 800 టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా, క్రికెట్ లవర్స్ కోసం శుభవార్త అందించారు.ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ లాంఛ్ కు ముహుర్తం ఖారారైంది. సెప్టెంబ‌ర్ 5న ముంబైలో మ‌ధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు 800 ట్రైల‌ర్‌ను సచిన్ టెండూల్కర్ లాంఛ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ సందడి చేస్తోంది. మురళీధరన్‌ పాత్రలో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ ఫేం మధుర్‌ మిట్టల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.సినిమా సీన్ల‌తో డిజైన్ చేసిన స్పెష‌ల్ వీడియోను శ్రీదేవి మూవీస్ షేర్ చేసింది.

DETAILS

మురళీధరన్‌ అరుదైన రికార్డు నేపథ్యంలోనే సినిమాకు 800 టైటిల్‌

ముత్త‌య్య మురళీధరన్‌ లుక్‌లో మధుర్ మిట్టల్ అచ్చం అలాగే క‌నిపిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్‌ రంగచారి నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 800 పాన్ ఇండియా థియేటర్ హక్కులను శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రలో మహిమ నంబియార్ నటించనుంది. ఘిబ్రాన్ బాణీలను అందిస్తున్నారు. 800 సినిమాను అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. కెరీర్‌లోనే అత్యధికంగా 800 టెస్టు వికెట్లు పడగొట్టిన ఏకైక ఆఫ్‌ స్పిన్నర్‌ గా మురళీధరన్‌ రికార్డు నేపథ్యంలోనే సినిమాకు 800 టైటిల్‌ను ఖరారు చేశారు.