Asia Cup: సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచులు జరిగిపోయాయి. ఈ రెండు మ్యాచులు ఎంతో ఉత్కంఠంగా సాగాయి. ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ శనివారం జరగనుంది. అయితే ఆసియా కప్ 2023లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సచిన్ టెండూల్కర్ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకూ ఆసియా కప్‌లో 23 వన్డేలు ఆడిన సచిన్ 971 పరుగులు చేసి భారత్ తరుపున అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక రోహిత్ శర్మ 22 వన్డేల్లో 745 పరుగులు చేశాడు. సచిన్ రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాలంటే మరో 226 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రోహిత్ శర్మ 10వేల పూర్తిగా చేయడానికి కేవలం 163 పరుగులు దూరంలో ఉన్నాడు.
గొప్ప రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
ఆసియా కప్ లో సురేశ్ రైనా 18 సిక్సర్లు బాది మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఈ రికార్డు బద్దలు కొట్టడానికి ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు. ఆసియా కప్‌లో టెండూల్కర్ 8 హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ (7) హాఫ్ సెంచరీలో రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 13 వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి విరాట్ కోహ్లీ 102 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 26,000 పరుగులు చేయడానికి కోహ్లీకి 418 పరుగులు అవసరం. సచిన్ టెండూల్కర్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483), మహేల జయవర్ధనే (25,957) తర్వాత కోహ్లీ (25,582) మాత్రమే ఉన్నారు.