
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయిదేళ్ల పాటు షూటింగ్ సాగిన హరిహర వీరమల్లు సినిమాను ఎట్టకేలకు పూర్తి చేశారు.
దీంతో ఈ సినిమా విడుదలకు పూర్తి సిద్ధంగా ఉంది. జూన్ 12న ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, రెండు పాటలను విడుదల చేసి భారీ అంచనాలు నెలకొల్పారు.
తాజాగా హరిహర వీరమల్లు నుంచి మూడో పాటగా 'అసుర హననం' అనే పాటను మే 21న ఉదయం 11 గంట 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Details
ఈనెల చివర్లో ట్రైలర్ రిలీజ్
ఈ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అదే రోజు మే 21న హరిహర వీరమల్లు సినిమా మొదటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు. అలాగే, ఈ నెల చివరలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
సాంగ్ రిలీజ్‌ను ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా కొత్తగా విడుదల చేశారు.