LOADING...
Movies: 'ధురంధర్ 2'కి షాక్.. టాప్‌లో చిన్న సినిమా
'ధురంధర్ 2'కి షాక్.. టాప్‌లో చిన్న సినిమా

Movies: 'ధురంధర్ 2'కి షాక్.. టాప్‌లో చిన్న సినిమా

వ్రాసిన వారు Moogati Shabari
Mar 26, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం బాలీవుడ్‌లో విడుదలైన "ధురంధర్ 2" సినిమా భారీ హంగామా సృష్టిస్తోంది. ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించింది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, కథలోని తీవ్రమైన భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, గౌరవ్ జెరా, సౌమ్యా టాండన్, అశ్విన్ ధర్ వంటి ప్రముఖులు తమ తమ పాత్రల్లో మెరిశారు.

వివరాలు 

రూ.1000 కోట్ల మార్క్ దాటేసి..

ఈ చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసి మరో రికార్డు సృష్టించింది. అంతకు ముందు వచ్చిన "ధురంధర్" కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇలాంటి భారీ విజయంతో దూసుకుపోతున్న ఈ సినిమాను ఒక చిన్న చిత్రం మించి ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యమే. ఎలాంటి పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిన్న సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ సినిమా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించిన "మేడ్ ఇన్ కొరియా". ఈ చిత్రం మార్చి 12న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

వివరాలు 

టాప్ ట్రెండింగ్‌లో చిన్న సినిమా

ఓటీటీలోకి వచ్చిన మొదటి వారంలోనే "మేడ్ ఇన్ కొరియా" సినిమా టాప్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా, రెండు వారాలు గడిచిన తరువాత కూడా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు. నెట్‌ ఫ్లిక్స్‌లో నాన్-ఇంగ్లీష్ విభాగంలో "ధురంధర్ 2"ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డైరెక్టర్ చేసిన పోస్ట్ ఇదే..

Advertisement