
Tamannaah: ఓటీటీలో మరో బోల్డ్ సిరీస్ తో రానున్న తమన్నా.. స్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఓటిటి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) మరోసారి వెబ్‌సిరీస్‌లో సిరీస్‌లో నటించారు. ఇప్పటికే పలు వెబ్‌సిరీస్‌లలో తన ప్రతిభను చాటిన ఆమె ఇప్పుడు 'డూ యూ వానా పార్ట్‌నర్' (Do You Wanna Partner) అనే కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ విడుదల తేదీ సోమవారంగా ఖరారు అయింది. సెప్టెంబరు 12 నుండి ఆ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.
వివరాలు
ఇద్దరు యువతుల స్నేహం, వారు ఎదుర్కొన్న సవాళ్లు
కామెడీ-డ్రామా శైలిలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ నటి డయానా పెంటీ (Diana Penty) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. నందిని గుప్త, ఆర్ష్, మిథున్ గంగోపాధ్యాయ రచించగా.. నిషాంత్ నాయక్, గంగోపాధ్యాయ తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో ఇద్దరు యువతుల మధ్య స్నేహం, వారి జీవితంలో ఎదురైన సవాళ్లు, అనుభవాలు తదితర అంశాలను ముఖ్యంగా చూపించనున్నారు.