Nayanthara: డాక్యుమెంటరీ వివాదం.. నయనతారకు మరో షాక్
ఈ వార్తాకథనం ఏంటి
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు 'బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో కొత్తగా లీగల్ సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్ ధనుష్ రూ.10 కోట్ల పరిహార దావాతో న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న నయన్ తాజాగా మరో సమస్యను ఎదుర్కొన్నారు.
తాజాగా 'చంద్రముఖి' నిర్మాతలు కూడా నయనతారతోపాటు నెట్‌ఫ్లిక్స్‌పై లీగల్ నోటీసులు పంపించారు.
నోటీసులో చంద్రముఖి చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వాడినట్లు ఆరోపించారు.
దీంతో నిర్మాతలు రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసులపై నయనతార ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
Details
తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా నయన్-ధనుష్ వివాదం
'నేనూ రౌడీనే' మూవీ షూటింగ్‌కు సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఉపయోగించినందుకు ధనుష్ రూ.10 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేశారు.
లీగల్ నోటీసుల తర్వాత నయనతార కూడా స్పందిస్తూ చట్టపరమైన పరిష్కారానికి సిద్ధమని స్పష్టం చేశారు.
నయనతార జీవిత ప్రయాణం, ఆమె పెళ్లి, కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలతో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతోంది.
అయితే అనుమతి లేకుండా చిత్ర క్లిప్పింగ్స్ ఉపయోగించినందుకు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారాయి.
ఇప్పటివరకు నయనతార-ధనుష్ మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. నయన్ చట్టపరమైన పోరాటానికి సిద్ధమని బహిరంగంగా ప్రకటించడంతో ఈ వివాదం కోర్టుకు చేరుకుంది.