
హిట్టు కోసం రీమేక్ వైపు నాగ చైతన్య చూపు? క్లారిటీ ఇచ్చిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా హిట్టు కోసం ఎంతగానో వేచి చూస్తున్నాడు నాగ చైతన్య. లవ్ స్టోరీ తర్వాత వచిన బంగార్రాజు ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశ పర్చాయి.
ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు నాగ చైతన్య. ఈ నేపథ్యంలో రీమేక్ వైపు నాగ చైతన్య చూపు మళ్ళిందని అంటున్నారు.
బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన భూల్ భులయ్యా 2 సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చింది. రీమేక్ పై స్పందించిన నాగ చైతన్య టీమ్, అసలు రీమేక్ చేసే ఉద్దేశ్యమే లేదని చెప్పుకొచ్చింది. కొత్త కథతోనే నాగ చైతన్య సినిమా తెరకెక్కనుందని క్లారిటీ ఇచ్చేసింది.
Details
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నాగ చైతన్య తర్వాతి సినిమా
నాగ చైతన్య నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఉంటుందని నిర్మాత బన్నీవాసు వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బోటు నడిపే వ్యక్తి పాత్రలో నాగ చైతన్య కనిపిస్తాడట.
గుజరాత్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సినిమా ఉంటుందని బన్నీవాసు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాను కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూడు సినిమాలకు చందూ మొండేటి కమిట్మెంట్ ఇచ్చినట్లు, అందులో ఒకటి 300కోట్ల సినిమా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.