Page Loader
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత 
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర విషయాలు వెల్లడి చేసిన బన్నీవాసు

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత 

వ్రాసిన వారు Sriram Pranateja
May 24, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప 2 సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమచారం అందుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తర్వాతి సినిమా గురించి చర్చ నడుస్తోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడో నిర్మాత బన్నీవాసు తెలియజేసాడు. మళయాలంలో విజయం సాధించిన 2018సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న బన్నీవాసు, ఆ చిత్ర ప్రమోషన్లలో మాట్లాడుతూ అల్లు అర్జున్ నెక్స్ట్ చిత్రం గురించి ఇలా అన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఉంటుందనీ, గీతా ఆర్ట్స్, సితార ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయని అన్నాడు.

Details

2024లో మొదలు కానున్న షూటింగ్ 

పుష్ప 2 సినిమా పూర్తికాగానే 2024లో త్రివిక్రమ్ తో సినిమా మొదలవుతుందనీ, ఫ్యామిలీ, యాక్షన్ అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమా ఉండబోతుందని, పాన్ ఇండియా లెవెల్లో అందరికీ నచ్చే విధంగా కథ ఉండబోతుందని బన్నీవాసు తెలియజేసారు. బన్నీవాసు మాటలతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. తమ అభిమాన హీరో నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు. అదలా ఉంచితే, మే 26వ తేదీన 2018సినిమా రిలీజ్ అవుతుంది. తుఫాను కారణంగా ఇరుక్కు డ్యామ్ గేట్లు సడెన్ గా తెరవడంతో, ఆ డ్యామ్ చుటుపక్కల ప్రాంతంలో నివసించే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేదే ఈ సినిమాలో చూపించబోతున్నారు.