Poonam Kaur: జానీ మాస్టర్ అని పిలవొద్దు.. పూనమ్ కౌర్ ట్వీట్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. 'ఢీ' కంటెస్టెంట్ శ్రేష్టి వర్మపై పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతనిపై ఆరోపణలొచ్చాయి. జానీ మాస్టర్ తన నివాసంలో పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని పేర్కొంది. శ్రేష్టి వర్మ చేసిన ఆరోపణలతో ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణలపై జానీ మాస్టర్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ వివాదం కారణంగా ఆయన రాజకీయ, సినీ కెరీర్ తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధిష్టానం కూడా ఆయనకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
జానీ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఈ నేపథ్యంలో, నటీ పూనమ్ కౌర్ ఈ వ్యవహారంపై స్పందించారు. జానీ మాస్టర్ అనొద్దు, 'మాస్టర్' అనే పదానికి విలువ ఉంది," అంటూ అమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే, జానీ మాస్టర్‌కు తీవ్ర శిక్షలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.