Karan Johar: 'క్లిక్స్ కోసం సెన్సేషన్ చేయొద్దు'.. సోషల్ మీడియాపై కరణ్ అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలువురు సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్, ఆలియా భట్, అనన్యా పాండే, కరీనా కపూర్, మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖులను ఆయన ఫాలో అవ్వకపోవడంతో నెట్టింట రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా కరణ్ జోహార్ స్పందిస్తూ అసలు కారణాన్ని వెల్లడించారు. సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడాన్ని జాతీయ వార్తలా చూపించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది కేవలం ఒక డిజిటల్ డిటాక్స్ మాత్రమే. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎక్కువ సమయం గడుపుతున్నాను. దాంతో విలువైన సమయం వృథా అవుతోంది.
వివరాలు
సోషల్ మీడియా తీరుపై అసహనం
అందుకే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుని చాలా మందిని అన్‌ఫాలో చేశానని కరణ్ తెలిపారు. అంతేకాకుండా "ఇది ఏమాత్రం జాతీయ వార్త కాదు. కేవలం క్లిక్స్, వ్యూస్ కోసం ఇలాంటి విషయాలను సెన్సేషన్ చేయొద్దు. మీకు వ్యూస్ కావాలంటే మరేదైనా చూడండి. ఇది పూర్తిగా అనవసరమైన అంశం అంటూ సోషల్ మీడియా తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరణ్ జోహార్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కేవలం 78 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే పలువురు బాలీవుడ్ స్టార్స్‌ను అన్‌ఫాలో చేసినప్పటికీ, నటి ప్రియాంక చోప్రాను మాత్రం ఇప్పటికీ ఫాలో అవుతుండటం మరో ఆసక్తికర అంశంగా మారింది.