Page Loader
Double Ismart:సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌  
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌

Double Ismart:సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌ పోతినేని కథానాయకుడిగా రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'డబుల్‌ ఇస్మార్ట్‌'. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలో విడుదలయ్యింది. 'డబుల్‌ ఇస్మార్ట్‌' ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో విడుదల కావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వివరాలు 

కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్‌ నటుడు

థియేటర్‌లో మిస్ అయిన వారు ఇంట్లోనే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఈ సినిమాలో రామ్‌ సరసన కావ్య థాపర్‌ కథానాయికగా నటించగా, బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించారు. సాయాజీ షిండే, గెటప్‌ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్‌ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మించారు. కాగా, పూరి గత చిత్రం 'లైగర్' కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.