
Gautham Menon : సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన 'ధృవ నక్షత్రం' ఇప్పటికే చాలామార్లు వాయిదా పడింది. ఈ మేరకు దర్శకుడు గౌతమ్ X వేదికగా స్పందించారు.
ఈ నేపథ్యంలోనే ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధమైన 'ధృవ నక్షత్రం' (Dhruva Natchathiram) విడుదలకు తటపటాయిస్తోంది.
ఈ సందర్భంగా సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. నవంబర్ 24న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ అంశంపై దర్శకుడు గౌతమ్ మీనన్ ఎమోషనల్' అయ్యారు.
ఎంతో తపనతో 'ధృవ నక్షత్రం' సినిమాను ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
DETAILS
మాపై మీ నమ్మకానికి ధన్యవాదాలు : గౌతమ్
అయితే మధ్యలో పనుల పురోగతిలో ప్రతికూలత ఎదురైందని బాధపడ్డారు. అయినప్పటికీ అంకితభావంతో సినిమాను పూర్తి చేశామన్నారు.
మరేం పర్వాలేదు త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.
నవంబర్ 24న విడుదల చేయాలని ఎంతో ప్రయత్నించామని, కానీ అనేకమైన అడ్డంకులు ఎదురయ్యాయన్నారు.
వాటిని అధిగమించడంలో విఫలమై ఎంతో నిరాశపడ్డామన్నారు. 'ధృవ నక్షత్రం' మూవీని మీ ముందుకు తెచ్చేందుకు శక్తికి మించి శ్రమిస్తున్నామన్నారు.
మీ అందరి ప్రేమ, మద్దతు మాకు అపారమైన భరోసానిస్తున్నాయని, మాకు నమ్మకాన్ని అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలని గౌతమ్ మీనన్ అన్నారు.
2016లోనే ఈ సినిమా పట్టాలెక్కినా, 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ ఆర్థిక ఇబ్బందులతో విడుదల నిలిచిపోయింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గౌతమ్ మీనన్ ఎమోషనల్ ట్వీట్
#DhruvaNatchathiram@OndragaEnt @oruoorileoru pic.twitter.com/Bbcn32sgWM
— Gauthamvasudevmenon (@menongautham) November 28, 2023