Page Loader
Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో..

Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతున్నాడు. అదే విధంగా మలయాళ హీరోయిన్ సంయుక్త కూడా తెలుగులో మంచి విజయాలే సాధిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఓ మలయాళ చిత్రం తాజాగా తెలుగులో డబ్బింగ్ అయి విడుదలకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్, సంయుక్త, నిఖిల విమల్ ప్రధాన పాత్రల్లో, యంతో జోసెఫ్ నిర్మాణంలో, నోఫాల్ దర్శకత్వంలో రూపొందిన "ఒరు యమండన్ ప్రేమకథ".

వివరాలు 

"ఆహా"లో స్ట్రీమింగ్

ఈ మలయాళ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే చిత్రం తెలుగు వెర్షన్‌గా "ఒక యముడి ప్రేమకథ" అనే పేరుతో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన "ఆహా"లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని భవాని మీడియా విడుదల చేసింది. హాస్యంతో కూడిన థ్రిల్లర్‌ శైలిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో తప్పక చూసేయండి.